Tuberculosis | సక్రమంగా మందులు వాడితే టీబీ నయం : వైద్యాధికారి మల్లికార్జున్ రావు
Tuberculosis | టీబీ నివారణకు సక్రమంగా మందులు వాడితే తొందరలోనే నయమవుతుందన్నారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని జనగాం జిల్లా వైద్యాధికారి మల్లికార్జున రావు సూచించారు.
TB | బచ్చన్నపేట, ఏప్రిల్ 16: టీబీ నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని జనగాం జిల్లా వైద్యాధికారి మల్లికార్జున రావు అన్నారు. టీబీ ముక్తభారత్ అభియాన్ పేస్ 2 లో భాగంగా బుధవారం బచ్చన్నపేట పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ నివారణకు సక్రమంగా మందులు వాడితే తొందరలోనే నయమవుతుందన్నారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఎండలు విపరీతంగా కొడుతున్నందున తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ లాగిశెట్టి అశోక్ కుమార్, కమలహాసన్, డాక్టర్ శ్రీనివాస్, సృజన, సిద్ధి సుదర్శన్ రెడ్డి, ప్రసన్న కృష్ణ, స్టాఫ్ నర్సులు,ఏఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు.
Read Also :
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

