రాయపర్తి, మే 2 : నడి వేసవిలో మండలంలోని రాగన్నగూడెం శివారు వనంవారి మాటు మత్తడి దుంకుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎండాకాలం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రాంతంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, బావులు, బోర్లన్నీ అడుగంటి పోయేవి. ప్రత్యేక రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వనంవారి మాటు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని మత్తడి పోస్తున్నది.