BRS Party | స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 02 : అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీది అభ్యాసం కాదు అది భస్మాసుర హస్తమని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. మంగళవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని జాతీయ రహదారి బస్టాండ్ వద్ద మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ రణభేరి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరుకాగా, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు.
ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 డెకరేషన్లతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేయి అడుగుల లోతులో తొక్కిపెట్టాలని రాజయ్య మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా వారి మాటలు వింటే ప్రజల రక్తం మరుగుతోందని, హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ పున: నిర్మాణం కోసం పార్టీ శ్రేణులు యాగంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగి, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని రాజయ్య అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతూ అన్ని వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా మరే పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో నీరుగారుతున్న పథకాలు-
నాగూర్ల వెంకన్న మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కేసీఆర్ మళ్లీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో సంక్షేమ పథకాలను సైతం కేసీఆర్ అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు. రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలతో రైతాంగానికి అండగా నిలవడమే కాకుండా, ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా చేశారని అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులను అందించింది అన్నారు. నేడు వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఒక్క నిమిషం కరెంటు పోతేనే వింతగా ఉండేదని, ఇప్పుడు గంటపాటు కరెంటు పోకపోతే వింతగా మారిందన్నారు.
ఎల్ నినో కారణంగా వర్షాలు లేక సాగునీరు కోసం మరోవైపు విద్యుత్తు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీ దేవుడెరుగు, కీసర అమలు చేసిన లక్ష రూపాయలు కూడా నేడు అందడం లేదని ఆరోపించారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చల్లా రమ్యారఘు రెడ్డి, పొన్న రాజేష్, తాటికొండ మధు, మాచర్ల గణేష్,ఆకుల కుమార్, మనోజ్ రెడ్డి చేవెళ్లి సంపత్, చందర్ రెడ్డి, కృష్ణసాయి, చిరంజీవి, మాలోత రమేష్ నాయక్, చట్ల యాకయ్య, కనకం గణేష్,రాజన్ బాబు, కుంభం కుమార్, గుండె రంజిత్ జోగు వినయ్, ఆగా రెడ్డి, ఒగ్గురాజు, పొన్న రంజిత్, మహబూబ్ పాషా, మారపల్లి ప్రసాద్, గుండె మల్లేష్, మారపాక రమేష్, మంతెన మహిపాల్ రెడ్డి, ముక్కెర మహేందర్, రాజేందర్, బిక్షపతి, అక్బర్, శేఖర్,కిరణ్, గోవింద్ అశోక్, హీరా సింగ్, ఉడుగుల భాగ్యలక్ష్మి, రమాదేవి, నీలం సుజాత, జ్యోతి రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Jailer 2 | జైలర్ 2’ రిలీజ్‌పై క్లారిటీ.. ఆ డేట్‌కి ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ మాస్ జాతర!
ప్రజా వ్యతిరేక పాలనపై భగ్గుమన్న బీఆర్ఎస్ మిర్యాలగూడ శ్రేణులు
ఢిల్లీ వాళ్ల కాళ్ల ముందు తెలంగాణ ఆత్మ గౌరవం : మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్