లింగాల ఘణపూర్ : కులగణన కాదది, కాంగ్రెస్(Congress) మోసపూరిత కుట్ర లెక్కలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బసవగాని శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు. లింగాల గణపురం మండల కేంద్రంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తప్పుడు లెక్కలతో బీసీల(BCs) అణచివేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సమగ్రంగా జరగలేదన్నారు. అందరిని సంప్రదించకుండానే అసమగ్రంగా సర్వే చేశారని విమర్శించారు. అనాదిగా రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతకు రేవంత్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
ఈ సర్వేతో వెనుకబడిన జాతుల యువకులకు, నిరుద్యోగులు, తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారుఎ. అశాస్త్రీయంగా చేపట్టిన కులగణనను సమాజం అంగీకరించదన్నారు. బీఆర్ఎస హయాంలో బీసీలకు సముచిత స్థానం లభించిందన్నారు. సమాజంలో 60% బీసీలు ఉంటే కుల గణన పేరా ప్రభుత్వం ఆ సంఖ్యను కుదించిందన్నారు. రిజర్వేషన్లు ప్రకటించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.