HANAMKONDA | హనుమకొండ చౌరస్తా, మార్చి 29: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం త్రికూటాలయంలోని విష్ణు ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలకు సర్వంసిద్ధం చేశారు. ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ ఉత్తిష్ఠగణపతి ఆరాదన రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం శడ్రుచులతో కూడిన బెల్లం, వేపపువ్వు, చింతపండు, ఉప్పు, కారం, మామిడిముక్కలతో చేసిన ప్రసాదం స్వామివారికి నివేదించి భక్తులకు అందజేయనున్నారు. అనంతరం విష్ణు ఆలయంలో శ్రీసీతారామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివార్ల ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం పాంచరాత్ర ఆగమానుసారంగా పురుషసూక్త విధానంతో అభిషేకం నిర్వర్తించి విశ్వక్సేన ఆరాదన పుణ్యహవాచనం కలుషస్థాపన కాళికాపూజ రుత్వ్రిక్కరణ అంకురారోపణతో నవాహ్నిక శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభించనున్నారు.
ఆదివారం సాయంత్రం విశ్వావసునామ సంవత్సరం ఉగాది వేడుకలు ప్రారంభమవుతాయని, సాయంత్రం 5.30 గంటలకు మంగళవాయిద్య సేవ జ్యోతిప్రజ్వలన, ఐనవోలు రాధాకృష్ణ సిద్ధాంతిచే పంచాంగశ్రవణం, ద్వాదశరాశులవారిఒకి గ్రహస్థితి ఆదాయ వ్యయం గురించి వివరించనున్నట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. అనంతరం తాడూరి రేణుక శిష్యబృందంచే స్వాగత నృత్యం. కవులచే కవిసమ్మేళనం నిర్వహించనున్నట్లు, కవులు పొట్లపల్లి శ్రీనివాసరావు, ఆచార్య బన్న అయిల్య, మహ్మద్ సిరాజుద్దీన్, వీఆర్ విద్యార్థి, వల్స పైడి, బిల్లా మహేందర్, నెల్లుట్ల రమాదేవి, వకుళవాసురామ రత్నమాల, సంయోజకులుగా తిరునగరి నరేందర్ వ్యవహరిస్తారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి-నీలిమ దంపతులు పాల్గొని శ్రీరామబ్రహ్మోత్సవాలు ఉగాది ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ప్రతి నిత్యం శ్రీసీతారామ స్వామివార్లకు సర్వగ్రహ దోష మానసిక శత్రు నివారనార్థం యాగశాలలో విక్సక్సేన, నవగ్రహ మహాసుదర్శన హోమం నిర్వహించబడుతుందని, ప్రత్యేక రుసుం రూ.2,116 చెల్లించిన) భక్తులు అనుమితించబడుతుందన్నారు. 6న ఆదివారం శ్రీసీతారామచంద్రస్వామివార్ల కళ్యాణోత్సవంలో పాలప్గొన్న భక్తులు రూ.1116 చెల్లించిన భక్తులకు శేషవస్త్రాలు, తలంబ్రాలు అందజేయనున్నట్లు కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.