బచ్చన్నపేట మార్చి18 : సామాజిక సేవే లక్ష్యంగా లైన్స్క్లబ్(Lions Club) బచ్చన్నపేట కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ బచ్చన్నపేట అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ బచ్చన్నపేట, ఆర్వీఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం కొడువటూర్ గ్రామంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ క్లబ్ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ రీజియన్ చైర్మన్ ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, పూర్వ జోనల్ చైర్మన్ జిల్లా రాజయ్య, తదితరులు ప్రజలు పాల్గొన్నారు.