పాలకుర్తి : పాలకుర్తి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ మండల అధ్యక్షుడు అబ్బోజు యాకస్వామి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాకస్వామి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంత కర్తగా తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన ముద్ర చెరగనిదని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు సలహాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మారోజు ఉపేంద్రాచారి, పట్టణ అధ్యక్షుడు గాంధారి సంపత్, మారోజు భిక్షపతి, ధర్డేపెల్లి గ్రామ అధ్యక్షుడు గుడిపెళ్ళి జలంధర్, రాగపురం గ్రామ అధ్యక్షుడు కాశోజు శుక్లాచారి, మారోజు సతీష్ చారి, నంచర్ల హరికృష్ణ, రాసమల్ల సంతోష్, మంచోజు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.