బచ్చన్నపేట మార్చి 9 : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి(Padmashalis) సంఘం నాయకులు మంగళపల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 17వ అఖిలభారత పద్మశాలి మహాసభ 8 వ మహాసభకు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో ఆదివారం జరిగింది. సభకు బచ్చన్నపేట నుండి పద్మశాలి కుల బాంధవులు సుమారు 200 మంది బయలుదేరి వెళ్లారు.
కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు గుర్రపు బాలరాజు, బేతి విమల, కృష్ణమూర్తి మచ్చ నరేందర్, వలాల శ్రీనివాస్, గణపురం నాగేష్, బొమ్మ నరసింహులు, వేముల రాములు, కుడికాల లక్ష్మణ్, గణపురం వెంకటేష్, శ్రీరామ్ శ్రీహరి, వేముల నరేష్, గుండ కేశవులు, మల్లిపెద్ది సిద్ధి లింగం, మావిడాల పాండు, తడకపల్లి విఠోభ, అర్చనపల్లి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.