జనగామ రూరల్, ఏప్రిల్02 : సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం భవిష్యత్ తరాలకు ఆదర్శమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా జనగామ మండలం పెంబర్తి గ్రామంలో బుధవారం పాపన్న గౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటేలా ప్రతి ఏడాది వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు.
పాపన్న గౌడ్ సేవలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు బైరి బాలరాజు గౌడ్, జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బల్దే సిద్ధిలింగం, మండల పార్టీ అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్, మాజీ సర్పంచ్ అంబాల ఆంజనేయులు గౌడ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చినబోయిన నరసయ్య, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షురాలు బొల్లం శారద, నాయకులు అంబాల సంపత్ గౌడ్, బండ రవి, కొండబోయిన రాజు యాదవ్, మాచర్లజు బాలకృష్ణ, బండ్రు సత్తయ్య, యాదగిరి, శ్రీశైలం, దయాకర్, తదితరులు పాల్గొన్నారు.