ఎస్బీఐ బ్యాంకులో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగామ : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదిక అమృత మహోత్సవాల్లో భాగంగా జనగామ ఎస్బీఐ బ్యాంకులో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున బ్యాంక్ మేనేజర్ శిరీషాతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్గదర్శకాలకు అనుగుణంగా జనగామ ఎస్బీఐ బ్రాంచ్‌లో భారత స్వాతంత్ర్యోద్యమం, విభజన జరిగిన విధానం, పోరాడిన తీరును ఫొటోఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశామన్నారు.

ఉత్సవాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన బ్యాంకులలో దేశవ్యాప్తంగా వెయ్యి బ్యాంకులు ఉండగా.. మన తెలంగాణలో మాత్రం 19 మాత్రమే ఉన్నాయన్నారు. అందులోజనగామ బ్యాంకు ఫొటో ఎగ్జిబిషన్‌కు ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

