పాలకుర్తి : బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ (CM KCR) తోనే యువతకు భవిత ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. నియోజకవర్గంలోని కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామం, కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు శనివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా పాలకుర్తి చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుడివాడ, పాలకుర్తి దేవాలయం మీదుగా పాలకుర్తి క్యాంపు కార్యాలయం వరకు జరిగిన ర్యాలీ (Rally) లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు పాలన(Ruling) చేతకాదని ఆరోపించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు.
రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పార్టీ మారిన నాయకులు వెల్లడించారు.తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ కొడకండ్ల మండల అధ్యక్షుడు సిందె రామోజీ, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, ఎన్ ఆర్ ఈజీఎస్ డైరెక్టర్ అందె యాకయ్య, సర్పంచ్ లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో..
కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు ఈరెంటి సాయి, చెన్నబోయిన అనిల్, మహ్మద్ పాషా, చెన్నబోయిన సంతోశ్, కె.పవన్, కె. కుమార్, ఎన్.యాకన్న, ఇ యశ్వంత్,ఈ పవన్, ఎం.పవన్, ఎన్ సందీప్, ఎన్.మహేశ్, సీహెచ్ ప్రకాశ్ తో పాటు 500 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా పాకాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పల్లె శ్రీకాంత్, ఉడుత సంపత్, బీజెవైఎం జనగామ జిల్లా కార్యదర్శి బండారి హరి కృష్ణ, బండారి యాదగిరి, బీఎస్పీ నాయకుడు అందె శ్రీవరుణ్, సామాజిక కార్యకర్త కాగితపు నరేశ్, కె. శ్రీకాంత్ తదితరులు బీఆర్ ఎస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.