రఘునాథపల్లి, ఫిబ్రవరి 24: జనగామ జిల్లా (Jangaon) రఘునాథపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం సమీపంలో అదుపుతప్పిన ఓ బైకు కిందపడటంతో యువకుడు అక్కడకక్కడే మరణించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు.
మృతుడిని పతేషాపురం గ్రామానికి చెందిన గడ్డం మహేందర్గా గుర్తించారు. ఆదివారం రాత్రి జరిగిన వివాహ వేడుకకు హాజరై, తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.