హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్
అనేక హామీలిచ్చి గద్దెనెక్కాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, పదేండ్లలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు బంద్ చేసి ఇబ్బందులు పెడుతున్నదని మాజీ మంత్రి,బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట కాలనీలో ఆదివారం సీసీ కెమెరాలు, మైక్ సౌండ్‌ను హరీశ్‌రావు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనల కాళ్లకుంట కాలనీని ఆదర్శంగా అభివృద్ధి చేసుకున్నట్లు గుర్తుచేశారు.
- మాజీ మంత్రి,బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
సిద్దిపేట, మే 31: అనేక హామీలిచ్చి గద్దెనెక్కాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, పదేండ్లలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు బంద్ చేసి ఇబ్బందులు పెడుతున్నదని మాజీ మంత్రి,బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కాళ్లకుంట కాలనీలో ఆదివారం సీసీ కెమెరాలు, మైక్ సౌండ్‌ను హరీశ్‌రావు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనల కాళ్లకుంట కాలనీని ఆదర్శంగా అభివృద్ధి చేసుకున్నట్లు గుర్తుచేశారు.
కాలనీలో రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని, చిన్న చిన్న రెండు మూడు పనులు మిగిలి పోయాయి తెలిపారు. అవి త్వరలో పూర్తి చేస్తామన్నారు. మారెట్, బస్తీ దవాఖాన ఏర్పాటు చేశామని, 59 జీవో కింద పట్టాలు ఇచ్చామని, ఇంకా మిగిలిన కొంతమంది కి త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు.బీడీ కార్మికులకు రూ.2వేల చొప్పున పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లీబిడ్డ సంక్షేమానికి కృషిచేసినట్లు తెలిపారు.
ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4వేల పింఛన్ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పి నేటికీ ఒకో మహిళకు రూ.75వేల బాకీ పడిందన్నారు. తులం బంగారం హామీ ఉట్టి మాటగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. మీకు పట్టాలు ఇచ్చింది ఎవరు.. దవాఖాన కట్టింది ఎవరు.. మారెట్ తెచ్చింది ఎవరు.. రోడ్లు వేసింది ఎవరు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు గుండు భూపేశ్, రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భాగ్యలక్ష్మి శ్రీనివాస్, బింగి రాజేశం, విఠోబా,అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

