గూగుల్ దోమల ఆపరేషన్.. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలో లక్షల దోమల విడుదలకు సిద్ధం
గూగుల్ కొత్తగా దోమల ఆపరేషన్ మొదలు పెట్టింది. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలో 32 మిలియన్ల దోమలను రిలీజ్ చేయడానికి యూఎస్ ఫెడరల్ రెగ్యులేటర్స్ నుంచి పర్మిషన్ కోరిందని యాహూ తన రిపోర్టులో తెలిపింది. ఈ దోమలను రిలీజ్ చేయడం వెనక ప్రత్యేక కారణం ఉన్నది.
- వ్యాధులు తగ్గిస్తామంటున్న దిగ్గజ టెక్ సంస్థ
న్యూఢిల్లీ, మే 31 : గూగుల్ కొత్తగా దోమల ఆపరేషన్ మొదలు పెట్టింది. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలో 32 మిలియన్ల దోమలను రిలీజ్ చేయడానికి యూఎస్ ఫెడరల్ రెగ్యులేటర్స్ నుంచి పర్మిషన్ కోరిందని యాహూ తన రిపోర్టులో తెలిపింది. ఈ దోమలను రిలీజ్ చేయడం వెనక ప్రత్యేక కారణం ఉన్నది. ప్రస్తుతం కాలిఫోర్నియా, ఫ్లోరిడాలో దోమల వల్ల వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి.
గూగుల్ ప్రత్యేకంగా జన్యుమార్పులు చేసిన దోమలతో ప్రస్తుతం ఆ రాష్ర్టాల్లో ఉన్న సాధారణ దోమలను అరికట్టొచ్చని చెబుతున్నారు. ఈ దోమలు వ్యాధులను వ్యాప్తి చేయవు. అలాగే ప్రస్తుతం వ్యాధులను వ్యాప్తి చేసే దోమల జనాభాను తగ్గించేలా వీటిని రూపొందించారు. అయితే ఈ దోమలను ఒకేసారి విడుదల చేయరు. రెండేండ్ల కాలంలో కొద్దికొద్దిగా విడుదల చేస్తారు. ఈ గ్యాప్‌లో నిపుణులు దోమల వ్యాప్తిని, వాటి పనితీరును పరిశీలిస్తారు. ఈ దోమలను సుదీర్ఘకాలంలో ఉపయోగించి కాలిఫోర్నియా, ఫ్లోరిడాను వ్యాధులు తెచ్చే దోమలు లేని రాష్ర్టాలుగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

