Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Tirumala | తిరుమలలో భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట చర్యలు చేపడుతోందని, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) లో భక్తుల నీటి అవసరాలకు ( Water Scarcity ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట చర్యలు చేపడుతోందని, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. బోర్డు సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి గురువారం తిరుమలకు నీటిని సరఫరా చేసే డ్యామ్‌లు, నీటి నిల్వలను పరిశీలించి సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, తిరుమలకు నీటి సరఫరా అందించే డ్యామ్‌లను స్వయంగా పరిశీలించి నీటి నిల్వలపై సమీక్షించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు మార్చి, ఏప్రిల్ నెలల వరకు సరిపోతాయని వెల్లడించారు. ఒకవేళ వర్షాలు కురవని పరిస్థితి ఏర్పడితే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
తిరుమలలోని డ్యామ్ లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు రాబోయే 150 రోజులకు సరిపోతాయని వివరించారు. తిరుమలలో రోజువారీ నీటి అవసరం 50 లక్షల గ్యాలన్లు కాగా, ఇందులో 50 శాతం టీటీడీ సొంత డ్యామ్‌ల నుంచి, మిగిలిన 50 శాతం కళ్యాణి డ్యామ్ నుంచి వినియోగిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసే వర్షాలతో డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందన్నారు.
అన్ని డ్యామ్‌లు నిండితే సుమారు ఏడాదిన్నర పాటు తిరుమలలో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు. తిరుమలలో నీటి వృథాను అరికట్టి పొదుపుగా వినియోగించేందుకు భక్తులకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు. కాటేజీలు, గదుల్లో నీటి లీకేజీలను అరికట్టడంతో పాటు ఆటోమేషన్ గేట్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

