Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Bengaluru Techie's Kidnap | సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతడి రూమ్మేట్ను కొందరు వ్యక్తులు డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో వారిద్దరిని రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడిన మహిళతో సహా 11 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఆ టెక్కీ, అతడి ఫ్రెండ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ ఆరోపించింది.
బెంగళూరు: సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతడి రూమ్మేట్ను కొందరు వ్యక్తులు డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో వారిద్దరిని రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడిన మహిళతో సహా 11 మందిని అరెస్ట్ చేశారు. (Bengaluru Techie’s Kidnap) అయితే ఆ టెక్కీ, అతడి ఫ్రెండ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో వారిద్దరిపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల బీ మహేంద్ర, బెంగళూరులోని ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 23 ఏళ్ల తరుణ్‌తో కలిసి మారతహళ్లి ప్రాంతంలో నివసిస్తున్నాడు.
కాగా, అక్టోబర్ 27న తెల్లవారుజామున 3 గంటల తర్వాత టెక్కీ అయిన మహేంద్ర, అతడి రూమ్మేట్ తరుణ్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మహేంద్ర తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆరు గంటల్లోనే అనుమానితులను గుర్తించారు. మహేంద్ర, తరుణ్‌లను సురక్షితంగా కాపాడారు. వారిద్దరిని కిడ్నాప్ చేసిన 21 ఏళ్ల మహిళతో సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు కోసమే ఆ ఇద్దరిని తాము కిడ్నాప్ చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు అక్టోబర్ 24న తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 4 గంటల మధ్య మహేంద్ర, అతడి రూమ్మేట్ తరుణ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు వారిద్దరి కిడ్నాప్ కేసులో అరెస్టైన 21 ఏళ్ల మహిళ ఆరోపించింది. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మారతహళ్లి పోలీసులు ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత మహేంద్ర, తరుణ్‌లను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే కిడ్నాప్ కేసు నిందితులను కోర్టులో హాజరుపరిచిన తర్వాత విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకుంటామని ఆ అధికారి వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

