Samantha Ruth Prabhu | ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’.. వైరలవుతున్న సమంత సంప్రదాయ వేడుక
Samantha Ruth Prabhu | త్వరలో తల్లి కాబోతున్న నటి సమంత రూత్ ప్రభు ఇంట్లో ఘనంగా జరిగిన ప్రత్యేక వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
త్వరలో తల్లి కాబోతున్న నటి సమంత రూత్ ప్రభు ఇంట్లో ఘనంగా జరిగిన ప్రత్యేక వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు మరియు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. రాజ్ నిడిమోరు సోదరి శీతల్ నిడిమోరు సోషల్ మీడియా వేదికగా ఈ వేడుక వివరాలను పంచుకున్నారు. తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ వేడుకలో భాగంగా శ్రీసూక్తం, గాయత్రీ దేవి హోమం నిర్వహించడంతో పాటు 21 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించారు. సమంత మరియు పుట్టబోయే బిడ్డ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఇరు కుటుంబాల పెద్దలు మనసారా ఆశీర్వదించారు.
ఈ వేడుక కోసం కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఒక పాటను కూడా రూపొందించారు. “బుజ్జాయి నువ్వు పుట్టక ముందే ఎంత ప్రేమను ఒక చోట చేర్చావో చూడు” అంటూ శీతల్ పంచుకున్న భావోద్వేగ పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ వేడుకలో సమంత ఎరుపు రంగు అనార్కలీ కుర్తా సెట్లో ప్రెగ్నెన్సీ గ్లోతో ఎంతో అందంగా కనిపించగా, రాజ్ నిడిమోరు క్రీమ్ కలర్ కుర్తా, వైట్ పైజామాలో మెరిశారు. అలాగే తన తల్లి నినెట్ ప్రభుతో పాటు రెండు కుటుంబాల మహిళలతో కలిసి దిగిన ఫోటోలను సమంత మా ప్రపంచం అనే క్యాప్షన్‌తో పంచుకున్నారు.
2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి ఆలయంలో సమంత, రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. ఈ జంట 2026 డిసెంబర్లో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. అంతకుముందు సెప్టెంబర్‌లో కూడా వీరు శ్రీవిద్య సంప్రదాయంలోని కళా ఆవరణ పద్ధతిలో మరో సీమంతం వేడుకను జరుపుకున్నారు. ప్రస్తుతం మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్న సమంత, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha Ruth Prabhu | ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’.. వైరలవుతున్న సమంత సంప్రదాయ వేడుక
ACB Raid | అదనంగా గంట హోటల్ నిర్వహణకు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్
Sweets | స్వీట్లను అధికంగా తినడాన్ని తగ్గించలేకపోతున్నారా.. ఇలా చేస్తే ఆ అలవాటును మానవచ్చు..
Harish Rao | కాపాడిన భూమిని మళ్లీ అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్.. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై హరీశ్ రావు
చిన్న మడంపల్లి పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

