చిన్న మడంపల్లి పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు
బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, ఆరోగ్యం, సంక్షేమంపై చిన్నారులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా చిన్న మడంపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ టి.గీతాబాయి...
– విద్యార్థులకు పోషకాహారం, వ్యక్తిగత భద్రతపై అవగాహన
కారేపల్లి, నవంబర్ 19 : బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, ఆరోగ్యం, సంక్షేమంపై చిన్నారులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా చిన్న మడంపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ టి.గీతాబాయి హాజరై మాట్లాడారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి పౌష్టికాహారం ఎంతో అవసరమని, ప్రతిరోజూ సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. అదేవిధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య ఉన్న తేడాలను తెలియజేస్తూ వ్యక్తిగత భద్రత, శరీర స్వేచ్ఛపై అవగాహన కల్పించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు.
బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని, అంతేకాకుండా చిన్న వయస్సులో వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాలల అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి ఎక్కడికీ వెళ్లకూడదని విద్యార్థులకు తెలియజేశారు. బాలల హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు పి.వీరయ్య, అంగన్వాడీ టీచర్లు ఎం.అన్నపూర్ణ, ఎస్.దయ, జె.సక్కుబాయి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కాపాడిన భూమిని మళ్లీ అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్.. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై హరీశ్ రావు
చిన్న మడంపల్లి పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు
Bridge collapses | రెండు లారీలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఒక లారీలో చెలరేగిన మంటలు
Road Accident | పల్నాడు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజరెడ్డి బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

