Bridge collapses | రెండు లారీలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఒక లారీలో చెలరేగిన మంటలు
Bridge collapses | ఒక వంతెనపై రెండు లారీలు వెళ్తుండగా అది కూలిపోయింది. ఒక లారీలో మంటలు చెలరేగాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టారు.
చండీగఢ్: ఒక వంతెనపై రెండు లారీలు వెళ్తుండగా అది కూలిపోయింది. ఒక లారీలో మంటలు చెలరేగాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టారు. (Bridge collapses) పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 6 గంటల సమయంలో పాటియాలా-సంగ్రూర్ బైపాస్‌లోని పాసియానా గ్రామం సమీపంలో భాక్రా మెయిన్ లైన్ కాలువపై ఉన్న ఐరన్ బ్రిడ్జిపై రెండు లారీలు ప్రయాణించాయి. అయితే ఉన్నట్టుండి ఆ వంతెన కూలిపోయింది. దీంతో ఆ రెండు లారీలు వంతెన శిథిలాల వద్ద చిక్కుకున్నాయి. ఒక లారీలో మంటలు చెలరేగాయి.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఒక లారీలో చెలరేగిన మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. రెండు లారీల డ్రైవర్లు స్వల్పంగా గాయపడినట్లు చెప్పారు. ఈ మార్గంలోని ట్రాఫిక్‌ను మరో రహదారి వైపు మళ్లించినట్లు వివరించారు. ఐరన్ బ్రిడ్జి కూలిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు పాటియాలా బైపాస్‌లోని భాక్రా మెయిన్ లైన్ కాలువపై 60 మీటర్ల పొడవైన స్టీల్ ట్రస్ బ్రిడ్జిని పంజాబ్ ప్రభుత్వ పీడబ్ల్యూడీ పర్యవేక్షణలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) 2016లో నిర్మించింది. నాలుగు లేన్ల పటియాలా బైపాస్ రోడ్డును 2018లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించారు. దీంతో ప్రస్తుతం ఈ మార్గాన్ని ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తున్నది. అయితే భాక్రా కాలువపై ఎడమ వైపు ఉన్న ఈ స్టీల్ బ్రిడ్జి కొంత కాలంగా ఊగుతున్నట్లు స్థానికులు ఆరోపించారు.
#WATCH | Patiala, Punjab: An incident occurred near Pasiyana village on the Patiala-Sangrur bypass when a bridge over the Bhakra Canal suddenly collapsed. Two trucks fell into the gap, and one of the trucks caught fire.
Upon receiving information about the incident, fire department vehicles arrived at the site and managed to bring the blaze under control after a strenuous effort. The cause of the bridge collapse is not yet known. Official information regarding any casualties or injuries in the incident is awaited.
— ANI (@ANI) November 19, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bhakra Canal
- bridge
- Collapses
- cross
RELATED ARTICLES
తాజా వార్తలు
Bridge collapses | రెండు లారీలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఒక లారీలో చెలరేగిన మంటలు
Road Accident | పల్నాడు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజరెడ్డి బాధ్యతల స్వీకరణ
Maatrubhumi | జీరో కట్స్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’.. విడుదల ఎప్పుడంటే?
Mahesh Kumar Goud | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను పరిశీలిస్తాం : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

