Harish Rao | కాపాడిన భూమిని మళ్లీ అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్.. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై హరీశ్ రావు
Harish Rao | కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని రద్దు చేయకపోతే 22, 23వ తేదీల్లో జరిగే నిరాహార దీక్షల్లో బీఆర్ ఎస్ పార్టీ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పష్టం చేశారు.
Harish Rao | కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిలపక్షం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
అఖిల్ పక్ష నేతలతో కలిసి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ మీరు ఈ వేలాన్ని రద్దు చేయకపోతే మిత్రుడు సత్యం ప్రతిపాదించినట్టు 22, 23వ తేదీల్లో జరిగే నిరాహార దీక్షల్లో బీఆర్ ఎస్ పార్టీ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుందని స్పష్టం చేశారు. 25వ తేదీ హెచ్ఎండీఏలో ముట్టడికి అఖిల పక్షం పిలుపులో బీఆర్ఎస్ కూడా పాల్గొంటుందన్నారు. ఇది ప్రజల కోసం.. రాజకీయాలో, వ్యక్తిగత స్వార్థం కోసమో కాదు. ఇది అమ్మేస్తే ఈ ట్రక్ పార్కింగ్తో వేలాది ప్రజలకు పొట్టకొట్టడం జరగుతుందన్నారు. వేలాది మంది జీవితాలు రోడ్డు మీద పడే ప్రమాదముందన్నారు.
మొన్న మేమక్కడికి పోయినప్పుడు వందల మంది అక్కడికి వచ్చి కలిశారు. మేమంతా సడెన్‌గా పోయినా కూడా ఆరేడు వందల మంద ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, డీసీఎం డ్రైవర్లు, అక్కడ పని చేసుకునే కూలీలు ఎంతో మంది అక్కడికి వచ్చి మమ్మల్ని కలిసి ఈ భూమిని కాపాడాలని కోరారన్నారు హరీశ్ రావు. 2008-09లో కూడా అప్పుడు ఇదే బీఆర్ ఎస్ పార్టీ, సీపీఎం వచ్చి మీరే పోరాడి ఆనాటి కాంగ్రెస్ అమ్మితే కూడా ఆపింది మీరే.. పదేళ్ల బీఆర్ ఎస్ యాంలో ఈ భూమిని కాపాడింది మీరే. మళ్లీ ఈ కాంగ్రెస్ అమ్మకానికి పెట్టింది.. దయచేసి మీరు ముందుపడి దీన్ని కాపాడాలని అక్కడుండే కార్మికులంతా కోరారు. ఈ భూమిని అమ్మితే రేవంత్ నీకు డబ్బులొస్తాయేమో.. కానీ వేలమంది కార్మికులు, డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడతాయని అన్నారు.
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిలపక్షం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను
లేకపోతే 22, 23 తేదీల్లో నిర్వహించే నిరాహార దీక్షతో పాటు, 25వ తేదీన అఖిలపక్షంతో కలిసి హెచ్ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాను
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2026
Read Also :
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కాపాడిన భూమిని మళ్లీ అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్.. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై హరీశ్ రావు
చిన్న మడంపల్లి పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు
Bridge collapses | రెండు లారీలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఒక లారీలో చెలరేగిన మంటలు
Road Accident | పల్నాడు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజరెడ్డి బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

