నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజరెడ్డి బాధ్యతల స్వీకరణ
నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజిరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న బి.వంశీకృష్ణ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో మిర్యాలగూడ కమిషనర్‌గా పని చేస్తున్న శ్రీజా రెడ్డికి ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ...
నీలగిరి, నవంబర్ 19 : నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజిరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న బి.వంశీకృష్ణ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో మిర్యాలగూడ కమిషనర్‌గా పని చేస్తున్న శ్రీజా రెడ్డికి ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె విధుల్లో చేరారు. గత 20 రోజులుగా నల్లగొండ కార్పొరేషన్లో నకీలీ మరణ ధృవీకరణ పత్రం ద్వారా కారుణ్య నియామకం పొందిన సంఘటనలో ఇప్పటికే 10 మంది వైద్యారోగ్య శాఖ అధికారులు కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు ఆఫీసర్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో ఇద్దరు ఈ సేవా జిల్లా ఇన్చార్జి, నిర్వాహకుడు పరారీలో ఉన్నారు. కాగా ఎలాంటి సమాచారం లేకుండా వచ్చినా, నాలుగు నెలలు గడవక ముందే కమిషనర్ బదిలీ కావడంతో పట్టణంలో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా నూతన కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ తన స్వస్థలం కావడం, ఇక్కడే పోస్టింగ్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పట్టణాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆమె వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పట్టణ సమస్యలపై చర్చించారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజరెడ్డి బాధ్యతల స్వీకరణ
Maatrubhumi | జీరో కట్స్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’.. విడుదల ఎప్పుడంటే?
Mahesh Kumar Goud | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను పరిశీలిస్తాం : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Cyclone Akvan | దూసుకొస్తున్న తీవ్ర తుఫాను అక్వాన్.. శుక్రవారం తీరాన్ని దాటే ఛాన్స్..!
Tirumala | తిరుమలలో తగ్గిన రద్దీ..హుండీ ఆదాయం రూ.4.55 కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

