Maatrubhumi | జీరో కట్స్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’.. విడుదల ఎప్పుడంటే?
SalmanKhan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'మాతృభూమి' ('మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్') చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మాతృభూమి’ (‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’) చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసింది. ఎలాంటి కట్స్ సూచించకుండానే సినిమాకు క్లియరెన్స్ లభించడం విశేషం. ఈ చిత్రం మొత్తం నిడివి 2 గంటల 34 నిమిషాల 12 సెకన్లుగా ఖరారైంది. తొలుత నవంబర్ 20న విడుదల చేయాలనుకున్నప్పటికీ, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
2020 గల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. దేశ రక్షణ కోసం పోరాడే సైనికాధికారి కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ నటించగా, కుటుంబ బాధ్యతలను నిలబెట్టే భార్య పాత్రలో చిత్రాంగదా సింగ్ కనిపించనున్నారు. వీరిద్దరి త్యాగం, భావోద్వేగాల చుట్టూ కథ సాగుతుంది. మొదట ఈ సినిమాను ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరుతో ప్రకటించగా, మార్చి 2026లో ‘మాతృభూమి’గా మార్చారు. ప్రభుత్వ ఒత్తిడితో స్క్రిప్ట్‌లో మార్పులు చేశారన్న వార్తలను సల్మాన్ ఖాన్ ఖండించారు. సెన్సార్ బోర్డు లేదా ఇతర ఏజెన్సీల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని, ఇది సైనికుల మానవీయ కోణాన్ని చూపించే కథ అని స్పష్టం చేశారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హిమేష్ రేష్మియా సంగీతం అందించారు. ఇటీవల ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ చిత్ర బృందానికి లక్షల రూపాయల విలువైన లగ్జరీ వాచీలను బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maatrubhumi | జీరో కట్స్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’.. విడుదల ఎప్పుడంటే?
Mahesh Kumar Goud | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను పరిశీలిస్తాం : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Cyclone Akvan | దూసుకొస్తున్న తీవ్ర తుఫాను అక్వాన్.. శుక్రవారం తీరాన్ని దాటే ఛాన్స్..!
Tirumala | తిరుమలలో తగ్గిన రద్దీ..హుండీ ఆదాయం రూ.4.55 కోట్లు
రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

