Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
Premayanam | ప్రేమ, భావోద్వేగాల అద్భుతమైన మేళవింపుతో తెరకెక్కిన 'ప్రేమాయణం' వెబ్ సిరీస్‌కు ప్రేక్షకులనుంచి విశేష స్పందన లభిస్తోంది. అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అందమైన ప్రేమకథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Premayanam | ప్రేమ, భావోద్వేగాల అద్భుతమైన మేళవింపుతో తెరకెక్కిన ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకులనుంచి విశేష స్పందన లభిస్తోంది. అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అందమైన ప్రేమకథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్‌కు వస్తున్న ఆదరణ చూసి చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాలంలో విడుదలైన అత్యుత్తమ షార్ట్ ఫిలిమ్స్/వెబ్ సిరీస్‌లలో ఒకటిగా ‘ప్రేమాయణం’ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
సూర్య మురపాక అద్భుతమైన రచన మరియు దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. హర్షిణి పిక్చర్స్ బ్యానర్‌పై కె. హర్షిణి యాదవ్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించగా, హరి చక్కటి సంగీతం అందించారు. ఇందులో పవన్, నైనిక అనసూయ ప్రధాన పాత్రల్లో నటించగా.. శ్రీలత, హరీశ్, కె. సంతోష్ తయ్యప్ప, దేవిక తదితరులు సహాయక పాత్రల్లో మెప్పించారు. చక్కటి ప్రేమకథా నేపథ్యంతో సాగే ఈ సిరీస్‌లో నటీనటుల సహజమైన అభినయం, ఆకట్టుకునే కథనం, మనసును హత్తుకునే సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా రొమాంటిక్ లవ్‌స్టోరీలను ఇష్టపడే యూత్‌కు ఈ సిరీస్ బాగా నచ్చుతోంది.
యూట్యూబ్‌లో విడుదలైన మొదటి రోజు నుంచే ‘ప్రేమాయణం’కు వస్తున్న ఆదరణ చిత్ర యూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తమ చిన్న ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తుండటం పట్ల దర్శకుడు సూర్య మురపాక, నిర్మాత కె. హర్షిణి యాదవ్‌తో పాటు నటీనటులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఈ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకువస్తామని చిత్ర బృందం వెల్లడించింది. ఎమోషనల్ లవ్‌స్టోరీలను ఇష్టపడే వారు ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్‌ను యూట్యూబ్‌లో తప్పకుండా వీక్షించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
‘ఏఐకేఎస్ మహా సభలను జయప్రదం చేయండి’
మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

