Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Case Register | జిల్లాలోని పోచంపల్లి మండలం రేవనపల్లిలోని శ్రీ విజయదుర్గ పీబీఆర్ఐ రైస్ మిల్లులో సీఎంఆర్ ధాన్యం మాయంపై అధికారులు కేసు నమోదు చేశారు.
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని పోచంపల్లి మండలం రేవనపల్లిలోని శ్రీ విజయదుర్గ పీబీఆర్ఐ రైస్ మిల్లులో సీఎంఆర్ ధాన్యం ( CMR paddy ) మాయంపై అధికారులు కేసు నమోదు ( Case Register ) చేశారు. సెప్టెంబరు 30న విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లులో సోదాలు నిర్వహించి సుమారు 3,731.016 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ రూ.13.77 కోట్లుగా అంచనా వేశారు.
తనిఖీల్లో నిల్వల వ్యత్యాసం గుర్తించి న జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ దాచేపల్లి హరికృష్ణ మిల్లు భాగస్వాములపై భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మిల్లు భాగస్వాములుగా ఉన్న చిట్టిమల్ల శ్రీనివాస్, అర్ధం అశోక్, మాశెట్టి కృష్ణమూర్తి, గార్లపాటి కృష్ణమూర్తి, చిట్టిమల్ల సువర్ణ, చిట్టిమల్ల లక్ష్మయ్య, గార్లపాటి భానుప్రకాశ్, సోమ శ్రీనివాస్‌లపై పోచంపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
‘ఏఐకేఎస్ మహా సభలను జయప్రదం చేయండి’
మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

