Jangaon : అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
- కల్యాణానికి హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
- భక్తులతో కిటకిటలాడిన ఆలయం

జనగామ రూరల్ : కల్యాణం, కమనీయం అనందదాయకంగా సీతారామచంద్రస్వామి వారి కల్యాణం అశేష భక్తుల మధ్య, మంగళవాయిద్యాలతో అర్చకుల విశేష పూజలతో స్వామివారి కల్యాణం ప్రధాన రుత్వికుడు శంకరాచార్యులు సమక్షంలో పెంబర్తిలో వైభవంగా జరిగింది. సోమవారం నిర్వహించిన వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మేళతాళాలతో స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సర్పంచ్ అంబాల ఆంజనేయులు దంపతులు, జనగామ మార్కెట్ చైర్పర్సన్ బాల్దె విజయ సిద్ధిలింగం దంపతులు సమర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగరి రెడ్డికి హాజరయ్యారు. ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఆలయ శిఖర ఇత్తడి కలశంను కూరోజు బుచ్చయ్య చారి సమకుర్చారు. రామలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్వామివారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ కోసం అహర్నిషలు శ్రమించి ప్రతిష్ఠించిన దాతలు, ముఖ్యదాత అడ్వకేట్ మల్యాల శివకుమార్‌ను గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో అందరూ కలిసి సీతారామచంద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, కల్యాణం జరిపించడం గొప్ప శుభ శుచకమన్నారు.

ప్రభుత్వం ఆలయాలకు పెద్దపీట వేస్తుందని, ఈ ఆలయానికి తప్పకుండా తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నిమ్మతి దీపిక, ఎంపీటీసీ మూల రవి, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ చినబోయిన రేఖరాజు, పంచాయతీ కార్యదర్శి ప్రపుల్ రెడ్డి, వీఆర్ఏ అయిలమల్లు, కారోబార్ వినయ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

