స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 19 : గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిత్రపటాలకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, సర్పంచ్ తాటికొండ సురేశ్ నేతృత్వంలో పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని జిట్టగూడెం, రంగరాయగూడెం, చంద్రుతండా, అక్కపల్లిగూడెం, నమిలిగొండ గ్రామాల్లో నూతన జీపీ భవనాల నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేయడం హర్షణీయమన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన జీపీలకు సొంత భవనాలు లేక పంచాయతీ పాలకవర్గాలు ఇబ్బందిపడుతున్నాయని తెలిపారు.
కొన్ని గ్రామాల్లో జీపీలు శిధిలావస్థకు చేరుకోవడంతో దీనిపై స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మం జూరు చేశారని తెలిపారు. మరోవైపు రంగరాయగూడెం లో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సట్ల సురేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లు డ్యాగల ఉప్పలస్వామి, సొసైటీ డైరెక్టర్ తోట సత్యం, ఎంపీటీసీలు సింగపురం దయాకర్, గుర్రం రాజు, నెలమంచి శైలజాఅజయ్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు చట్ల సురేశ్‌గౌడ్, కోల హరికృష్ణ, మోటం ప్రభాకర్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు స్వాతిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ చిగురు సరిత, మాజీ సర్పంచ్ నగరబోయిన శ్రీరాములు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గట్టు రమేశ్, గుర్రం ఏసుబాబు, బొంకూరి దయాకర్, జ్యోతి రెడ్డి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లిలో..
రఘునాథపల్లి : నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడం హర్షణీయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వారాల రమేశ్‌యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారాల రమేశ్‌యాదవ్ విలేకరులతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ 500 జనాభా ఉన్న తండాలను, పల్లెలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. జీపీలకు పక్కా భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన వివరించారు.
రానున్న రోజుల్లో దేశంలో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని, కేసీఆర్ ప్రధాని అవుతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్తోనే దేశంలోని అన్నదాతలు, కార్మికుల సమస్యలు పరిష్కారమవుతా యని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ముసిపట్ల విజయ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, నాయకులు నామాల బుచ్చయ్య, సర్పంచ్‌లు బొల్లపల్లి మంజుల, బక్క యాదగిరి, గుడి రాంరెడ్డి, పార్నంది కొమురయ్య, వెంకట్ నాయక్, యూత్ నాయకులు శాగ సురేశ్, ముక్క పరశురాములు, శివరాత్రి రాజు, తాళ్లపల్లి ఎల్లయ్య, నర్ర అశోక్, రేసు కుమార్, అరూరి శ్రీనివాస్, జేరిపోతుల మహేందర్, బిర్రు మధు దొనికెల రమాదేవి, ఎడ్ల అమృత తదితరులు పాల్గొన్నారు.
చిల్పూరు మండలంలోఎనిమిది జీపీలకు నిధులు మంజూరు
చిల్పూరు : మండలంలో కొత్తగా ఏర్పడిన ఎనిమిది గ్రామ పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీయస్) నుంచి ఎనిమిది గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరయ్యాయి. వీటిలో గార్లగడ్డతండా, తీగలతండా, కృష్ణాజీగూడెం, లింగంపల్లి, రాజవరం, శ్రీపతిపల్లి, వంగాలపల్లి, దేశాయితండాలో జీపీల భవన నిర్మాణానికి రూ.20 లక్షల అంచనాతో మంజురు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్, మం త్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూక్యా రమేశ్ నాయక్. కృతజ్ఞతలు తెలిపారు.