జనగామ రూరల్: జనగామ మండలంలోని షామీర్పేట, పసరమడ్ల, ఎల్లంల గ్రామాల్లో ఎంపీపీ మేకల కళింగ రాజు రైతులతో కలిసి ఆదివారం ఎండిపోయిన పొలాలను(Dried crop fields) పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా మండలంలోని అన్ని గ్రామాల చెరువులను నింపారన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా ముందు చూపుతో చెరువులను నింపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా రైతుల పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.
నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. జనగామ ప్రాంత రైతాంగం అనేక పోరాటాలు చేసి పోరాటాలు చేసి రిజర్వాయర్లను సాధించుకుంది. వాటిని నేడు నింపకుండా పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు పొలాలకు నీళ్లు అందించాలి. లేదంటే పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.