ములుగు : ప్రసిద్ధ మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు వనదేవతలకు పసుపు, కుంకుమ సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు.
ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పుట్ట మధుకర్, కోరుకంటి చందర్, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, గంగుల అశోక్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పెంట రాజేష్, రాకేష్, ఏలేటి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.