బచ్చన్నపేట : బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఇంద్రనగర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన బొమ్మెళ్ళ సుజాత, బాలనర్సయ్యల కుమార్తె భవాని వివాహానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సామాజికవేత్త జిల్లా సందీప్ రూ.5,000 ఆర్థిక సాయం చేశారు. అమ్మాయి కుటుంబసభ్యులు జిల్లా సందీప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా సందీప్ మాట్లాడుతూ.. సంపాదించిన దాంట్లో నుంచి పేదలకు తోచిన సాయం అందించడంలోనే మనసు సంతృప్తి చెందుతుందని, ఇక ముందు కూడా నిరుపేదలకు సాయం అందించి ఆదుకోవడంలో ముందుంటానని అన్నారు. కార్యక్రమంలో కోడూరి మహాత్మాచారి, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్న, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎద్దు హరీష్, ఉపాధ్యక్షులు పోచంపల్లి నాగరాజు, నల్లగోని బాలకిషన్, ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, చెరుకూరి శ్రీనివాస్, కురాకుల రవి, సిరిపాటి రామదాసు, నీల రమేష్, ఆవదూత శ్రీనివాస్, గంధమల్ల కిష్టయ్య, కొండ హరికృష్ణ, చింతల కరుణాకర్, బొట్టు సుధాకర్, సందేల రాము, మహిళా నాయకురాలు వేణు వందన, కళ్యాణ్ రామ్, హరి బాబు, పరిధి శ్రీనివాస్, యువ నాయకులు అఖిల్ మాల, మోహన్ గౌడ్, సమ్మేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవ కార్యకర్త జంగిటి విద్యనాథ్ కూడా ఈ వివాహానికి రూ.5000 సాయం అందించి అండగా నిలిచారు. ఆయన వెంట నల్లగొని బాలకిషన్ గౌడ్, నారాయణ రెడ్డి, గుర్రపు బాలరాజు, యాదగిరి, మహాత్మచారి రాజయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.