Farmers | ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులకు కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు తప్పడం లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునే పరిస్థితి కరువవడంతో లబోదిబోమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రైతులు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ వడ్లు, మక్కలు కొనండి మహాప్రభో అంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.
మీ కాళ్లు మొక్కుతాం మా పంట కొనండి సారూ అంటూ జనగామ జిల్లా కేంద్రంలోని వడ్లకొండ గ్రామంలో రైతులే వేడుకుంటున్న దృశ్యాలు కాంగ్రెస్ సర్కార్ రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును అద్దం పడుతోంది. ప్రభుత్వం పంట కొనుగోలు చేయడంలేదని వడ్లకొండ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు
ఆందోళనకు దిగిన రైతులను చెదరగొట్టేందుకు రావడంతో.. రైతులు పోలీసుల కాళ్ల మీద పడి, ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదని తాము నిరసనకు దిగామని తమను అడ్డుకోవద్దని వేడుకున్నారు. రైతు ఓ పోలీసాఫీసర్ కాళ్లపై పడుతూ వేడుకుంటున్న దృశ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మరోసారి అద్ధం పడుతున్నాయి.
మీ కాళ్లు మొక్కుతాం మా పంట కొనండి సారు
జనగామ జిల్లా కేంద్రంలోని వడ్లకొండ గ్రామంలో ప్రభుత్వం పంట కొనుగోలు చేయడంలేదని రైతుల ఆందోళన
ఆందోళనకు దిగిన రైతులను చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసుల కాళ్ల మీద పడి, ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదని నిరసనకు దిగామని తమను అడ్డుకోవద్దని వేడుకున్న… pic.twitter.com/3ISvTXouN7
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026