Farmers Strike | జనగామ రూరల్, జూలై 12 : బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరును అందించాలని మాజీ ఎంపీపీ మేకల కళింగ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జనగామ మండలంలోని షామీర్పేట గ్రామ కాళోజీ చౌరస్తాలో పలు గ్రామాల రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కళింగ రాజు మాట్లాడుతూ.. గతంలో నిత్యం పచ్చని పంటలతో కలకలలాడిన నేలపై ఈ రోజు ఎండిపోయిన చెరువులు, కాలువలు, పంట పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. రైతులు వేసిన వరి పంట భూగర్భ జలాలు లేకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పట్టించుకోని గ్రామాల్లో ఉన్న చెరువులకు గోదావరి జలాలు విడుదల చేయాలని రైతులందరూ రోడ్డెక్కి ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు ఫోన్లో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది.
ఒకవేళ నీటిని విడుదల చేయకపోతే భారీ మొత్తంలో ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి చేస్తామని రైతులు, నాయకులు హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు బైరగోని యాదగిరి గౌడ్, మైపాల్, శంకర్ నాయక్, ఉప్పలయ్య, రవి, సిద్ధులు, స్వామి, డానియల్, పలువురు రైతులు పాల్గొన్నారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి