జనగామ రూరల్ : ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి పంటలను కాపాడుకుంతుంటే.. కండ్లముందే చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండటంపై రైతన్నలు కన్నెర్ర జేశారు. తక్షణమే నీటిని విడుదల చేసి పంటాలను కాపాడాలని ఆందోళనకు(Farmers protest) దిగారు. వివరాల్లోకి వెళ్తే..బొమ్మకురు రిజర్వాయర్ నుంచి పలు గ్రామాలకు గోదావరి జలాలు(Godavari waters) విడుదల చేయాలని గురువారం ఇరిగేషన్ కార్యాలయం ముందు రైతులు నిరసన వ్యక్తం చేశారు.
మండలంలోని గానుగుపాడు, ఎర్రగుంట తండా గ్రామాలకు నీటిని విడుదల చేయాలని, వేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నీటి విడుదల కోసం పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. తక్షణం గోదావరి జలాలు విడుదల చేసి రైతుల పంట పొలాలను కాపాడాలని కోరుతున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.