లింగాలఘనపురం, డిసెంబర్ 14 : దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చే సత్తా సీఎం కేసీఆర్‌కే ఉందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విపక్ష పాలి త రాష్ర్టాలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో దీనిని సమూలంగా మా ర్చేందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించిన నేపథ్యంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి పార్టీ జిల్లా, మండల నాయకులు తరలివెళ్లారు. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ అని నినదించారు. రాజశ్యామల హోమం, నవచండీ యాగంలో వారు పాల్గొన్నారు. రాజయ్య మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యే యంగా తెలంగాణ సర్కారు పాలన అందిస్తున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దేశంలోని విపక్ష పార్టీలను ఏకం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ విధానాలపై పోరాడుతున్న బీఆర్ఎస్ భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఢిల్లీకి తరలివెళ్లిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, మండలంలోని వనపర్తికి చెందిన కొమురవెల్లి దేవస్ధాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ తదితరులు ఉన్నారు.
చిల్పూరులో..
చిల్పూరు : బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన నేపథ్యంలో మండలంలోని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న బీజేపీపై ప్రజలు పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఢిల్లికి తరలివెళ్లిన వారిలో సర్పంచ్ల ఫోరం చిల్పూరు మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జనగామ యాదగిరి, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇల్లందుల సుదర్శన్, లింగంపల్లి సర్పంచ్ ఎదునూరి రవీందర్, మల్కాపూర్ ఉప సర్పంచ్ బబ్బుల వంశీ, స్టేషన్ ఘన్పూర్ ఎంపీటీసీ గన్ను నరిసింహులు ఉన్నారు.