బచ్చన్నపేట, మర్చి 12 : ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం(CPM )మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ డిమాండ్ చేశారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో చినరామన్ చెర్ల గ్రామంలో గ్రామ సమస్యలపై ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంకొండ వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇప్పటికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రైతు భరోసా, పంట రుణాలు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గ్రామంలో మురికి కాలువలు, సీసీ రోడ్లు, వీధిలైట్లు సరిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు అన్నేబోయిన రాజు, పర్వతం నర్సింలు, గ్రామ శాఖ కార్యదర్శి బుర్రి సుధాకర్, పార్టీ సభ్యులు గుడికందుల నాగరాజు, నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.