లింగాల గణపురం : వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో సాగునీటికి(Irrigation water) తాగునీటికి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తూ ఎండిపోతున్న పంటల రైతులను కలిసి తగు చర్యలు తీసుకొని తాము ఉన్నామనే భరోసా రైతుల్లో కలిగించాలన్నారు.
ఎల్ఆర్ఎస్ పని తీరుపై కార్యదర్శులను ఈ సందర్భంగా కలెక్టర్ మందలించారు. ఉపాధి హామీ కూలీలకు ఉదయం పూట మాత్రమే పనులు చేయించాలన్నారు. లింగాల గణపుర అంగన్వాడీ కేంద్రానికి బాటను అడ్డుకుంటున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అంగన్వాడీ టీచర్ విధుల్లోకి రాకుంటే సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రవీందర్, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.