బచ్చన్నపేట మార్చి 23 : సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వాస్విక్ ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు. ఆదివారం వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండల కేంద్రం బస్టాండ్ వద్ద ప్రజల దాహార్తిని తీర్చడానికి సీఐ అబ్బయ్య చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజా సమస్యలను తీరుస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్న వాస్విక్ చైర్మన్ వైస్ చైర్మన్ లను ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. సామాజిక సేవ చేసేందకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆముదాల భూపాల్ రెడ్డి, నూకల రమేష్ రెడ్డి, నూకల నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, పిల్లి ఆంజనేయులు, మహేష్, అజీమ్, తదితరులు పాల్గొన్నారు.