జనగాం : జనగామ జిల్లా చిల్పూరు గ్రామంలోని బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణాన్ని అర్చకుల వేదమంత్రోచ్చరణలతో వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్తల మండలి సభ్యులు గోలి రాశేఖర్, వేముల వెంకటేశ్వర్లు , గణగోని రమేశ్ పాల్గొన్నారు.
ఆలయ ఈవో శ్రీమతి బీ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ కె మోహన్, ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది హాజరయ్యారు. పాల్గొన్నారు.