వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఓసిటీ ఇండోర్ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం
కాశీబుగ్గ, ఆగస్టు 29: జిల్లాలో క్రీడాభివృద్ధికి మరింత కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ ఓసిటీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడలతోనే మానసికోల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో క్రీడాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. నూతన జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, క్రీడా హబ్‌గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతానన్నారు. క్రీడా గ్రౌండ్ ఏర్పాటుకు ఇటీవల మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లా ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సహకరించిన మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా నన్నపునేని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్ఏ ప్రతినిధులు, క్రీడాకారులు, స్థానికులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
వరంగల్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని బల్దియా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో వరంగల్ మహానగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జూడో కోచ్ కిరణ్, బ్యాడ్మింటన్ కోచ్ శ్రీధర్, క్రీడాకారులు పాల్గొన్నారు.