జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీత
పలుచోట్ల ఘనంగా జాతీయ క్రీడల దినోత్సవం
కృష్ణకాలనీ/ ములుగుటౌన్/ ఏటూరునాగారం/ వెంకటాపూర్, ఆగస్టు 29: అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి దేశానికి ఖ్యాతిని తీసుకువచ్చిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీత అన్నారు. ఆదివారం జిల్లా యువజన, క్రీడల శాఖ, జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడామైదానంలో జాతీయ క్రీడల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎస్వో సునీత, హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని క్రీడాకారులకు హాకీ, అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎస్వో మాట్లాడుతూ మేజర్ ధ్యాన్‌చంద్ హాకీలో దేశానికి ఖ్యాతిని తీసుకువచ్చారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని క్రీడాకారులు హాకీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. సీఎం కేసీఆర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సహకారంతో జిల్లాలో అన్నిరకాల క్రీడల అభివృద్ధికి పాటుపడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని అన్నారు. హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో హాకీ క్రీడాభివృద్ధికి క్రీడాకారును ప్రోత్సహిస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన హాకీ క్రీడలో దేశానికి కాంస్య పతకం రావడం అభినందనీయమన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శివసాగర్, సింగరేణి జిమ్ కోచ్ తిరుపతి, అథ్లెటిక్స్ ట్రైనర్ రఘువీర్, 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ అథారిటీ అదేశానుసారం జాతీయ క్రీడా దినోత్సవం, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా యువజన క్రీడల అధికారి పీ.వెంకట రమణాచారి మాట్లాడుతూ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని క్రీడలపై ఆసక్తిని పెంచుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. కార్యక్రయంలో యువజన, క్రీడల శాఖ సిబ్బంది, సాంబయ్య, లావణ్య, పీడీలు, పీఈటీలు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
2కేఎం రన్
ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆదివారం ఏటూరునాగారం వై జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు స్పోర్ట్స్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే ఎం రన్‌ను స్థానిక ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సై ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. విజేతలుగా నిలిచిన ఆర్ యశ్వంత్(ప్రథమ), సిద్దూ(ద్వితీయ), రోహిత్(తృతీయ), కే.మీనల్‌కు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోచ్ పర్వతాల కుమార్, సభ్యులు సిరాజ్, రఘు, లాలయ్య, ఎల్లయ్య, సాంబశివరావు, సర్దార్‌పాషా, వీ సాంబశివరావు,శ్రీరాం, మల్లయ్య, శ్రావణ్, భిక్షపతి, రాజబాబు, చందర్, నరేశ్, నర్సయ్య, హన్మంతు, మధు తదితరులు పాల్గొన్నారు.
ధ్యాన్‌చంద్ సేవలు మరువలేనివి
దేశ కీర్తిని ప్రపంచానికి చాటి క్రీడాలోకం ఆశ్చర్యపోయేలా ఒలింపిక్ క్రీడల చరిత్ర లోనే మూడుసార్లు బంగారు పతకాలు సాధించిన మేజర్ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ సేవలు మరువలేనివని బాక్సింగ్ కోచ్ మామిడిపెల్లి రమేశ్, పీడీ సంగ చేరాలు అన్నారు. వెంకటాపూర్ మండల కేంద్రంలో జాతీయ క్రీడాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జనగాం బాబురావు, సలెందర్, క్రీడాకారులు చంటి జాన్, జన్ను ప్రవీణ్, వివేక్, ప్రణయ్, సన్ని, చందర్, బన్ని, సిద్దు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.