సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు
మంత్రి సత్యవతిరాథోడ్
సీఎంఆర్ఎఫ్ నుంచి బాధితుడికి రూ. 4 లక్షల ఎల్వోసీ అందజేత
మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 23: సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రతి పేద కుటుంబాన్నీ ఆదుకుంటామని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా రు. మండల పరిధిలోని బోడగుట్ట తండా జమాండ్లపల్లి గ్రామానికి చెందిన బానోత్ రెడ్యా కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 4 లక్షల ఎల్వోసీ మంజూరు కాగా, సోమవారం మహబూబాబాద్‌లోని తన నివాసంలో బాధితుడికి మంత్రి సత్యవతిరాథోడ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా బోడగుట్ట తండా గ్రామ సర్పంచ్ అజ్మీ రా సత్తెమ్మ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, తండా వాసులు, తదితరులు పాల్గొన్నారు.