భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు
గిరిజనులకు హక్కు పత్రాలు కల్పించనున్న ప్రభుత్వం
అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి
కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ములుగు, భూపాలపల్లి జిల్లాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం
ములుగుటౌన్, అక్టోబర్ 22 : మేడారం జాత ర సమీపిస్తున్నందున త్వరలో టెండర్లు పిలిచి ప నులు ప్రారంభిస్తామని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అ న్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం జాతరలో అన్ని వసతులు కల్పించేందుకు ఒక క మిటీని ఏర్పాటు చేసి నివేదిక తయారు చేసి చర్య లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఏర్పా ట్లు, మౌలిక వసతులపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. సాధ్యమైనంత తొందలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. గిరిజనులకు హ క్కు పత్రాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సదావకాశం కల్పించిందని తెలిపారు. పోడు భూ ముల సమస్యలపై పెండింగ్లో ఉన్న హైకోర్టు కే సులపై, తహసీల్, ఎంపీడీవో కార్యాలయాల్లో రికార్డులు స్క్యానింగ్ చేసి కంప్యూటర్లో భద్రపర్చాలన్నారు. పెండింగ్లో ఉన్న హైకోర్టు కేసులను వెంటనే పరిష్కరించేలా తహసీల్దార్ల ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలన్నారు. మండలాభివృద్ధి కార్యాలయాల్లో ఉన్న ఫైళ్ల నిర్వహణ క్రమపద్ధతిలో ఉండేలా చూడాలని అన్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలో ఎంపీడీవో కార్యాలయాల తనిఖీ ఉం టుందని, ఫైళ్లు క్రమ పద్ధతిలో లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ములు గు, భూపాలపల్లి ఆర్డీవోలు రమాదేవి, శ్రీనివాస్, భూపాలపల్లి ముఖ్య ప్రణాళిక అధికారి శామ్యూ ల్, ఏటూరునాగారం ఐటీడీఏ జనరల్ పీవో వసంతరావు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.