Mrunal Takhur | సినీ ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కొత్త విషయం కాదు. ఇద్దరు నటీనటులు కలిసి ఒక ఈవెంట్లో కనిపించినా, సోషల్ మీడియాలో వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. ఇదే పరిస్థితి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విషయంలో కూడా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారన్న ప్రచారం సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ రూమర్స్‌కు అసలు కారణం ఒక పార్టీ. ఓ ప్రైవేట్ ఈవెంట్లో ధనుష్, మృణాల్ ఇద్దరూ కలిసి కనిపించడంతో మొదట సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దానికి తోడు మృణాల్ నటించిన ఓ సినిమా ఈవెంట్‌కు ధనుష్ హాజరుకావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
అప్పటి నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వరుసగా వినిపించాయి. మృణాల్ గతంలో “మేము కేవలం మంచి స్నేహితులమే” అని చెప్పినా కూడా ఈ ప్రచారానికి బ్రేక్ పడలేదు. కొందరు అయితే మరో అడుగు ముందుకేసి వాలెంటైన్స్ డే రోజున అంటే ఫిబ్రవరి 14న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు సృష్టించారు.ఇటీవల తన హిందీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాకూర్‌ను యాంకర్ నేరుగా ఈ విషయంపై ప్రశ్నించాడు. “ఫిబ్రవరి 14న ధనుష్‌తో పెళ్లి చేసుకుంటున్నారా?” అని అడగగా మృణాల్ నవ్వుతూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది.
“ఫిబ్రవరి 14 కాదు… ఏప్రిల్ 1న చేసుకుంటానేమో. ఎందుకంటే అది ఏప్రిల్ ఫూల్స్ డే కదా!” అంటూ చమత్కరించింది. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. అదే ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ, “ఈ రూమర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నాకు తెలియదు. కొందరు ‘మృణాల్ పెళ్లి అధికారికంగా ఖరారు అయింది’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా భయంకరంగా ఉంది” అని చెప్పింది. ఇలా క్లియర్ క్లారిటీ ద్వారా ధనుష్‌తో పెళ్లి వార్తలకు మృణాల్ పూర్తిగా చెక్ పెట్టినట్టే అయ్యింది.గతంలో ఈ డేటింగ్ రూమర్స్‌పై మృణాల్ ఒక పోస్ట్ పెట్టి “విని నవ్వుకుంటాం” అని రాసింది. అయితే ఇప్పుడు మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో డైరెక్ట్‌గా స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం స్నేహం మాత్రమేనని మరోసారి స్పష్టమైంది.