Warangal MGM : ఖమ్మం జిల్లాకు చెందిన కాంతారావుకు గుండెపోటు రావడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెంచారు. అయితే మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి కుటుంబసభ్యులు ప్రయత్నించగా సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు.
మృతదేహాన్ని బయట అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్లేందుకు నిరాకరించారు. కనీసం స్ట్రెచర్ ఇవ్వమన్నా ఇవ్వలేదు. దాంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని చేతుల మీద తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై వారు ఆవేదన వ్యక్తంచేశారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం
ఖమ్మంకు చెందిన కాంతారావుకు గుండెపోటు రావడంతో ఎంజీఎంకు తీసుకువచ్చిన కుటుంబసభ్యులు
అయితే నిన్న సాయంత్రం మృతి చెందగా మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి నిరాకరించిన సిబ్బంది
కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో.. చేసేది ఏమీ లేక మృతదేహాన్ని చేతుల మీదుగా… pic.twitter.com/hJxIsUv1CL
— Telugu Scribe (@TeluguScribe) February 14, 2026