Emo Emo Idi | జానర్ మార్చిన శైలేష్ కొలను: రోషన్ మేకతో రొమాంటిక్ కామెడీ.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
Sailesh Kolanu | యంగ్ హీరో రోషన్ మేక (శ్రీకాంత్ కుమారుడు), టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్లో రూపొందుతున్న సరికొత్త చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ అనే క్లాసిక్ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.
Roshan Meka | యంగ్ హీరో రోషన్ మేక (శ్రీకాంత్ కుమారుడు), టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్లో రూపొందుతున్న సరికొత్త చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ అనే క్లాసిక్ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. వాలెంటైన్స్ డే సందర్భంగా శనివారం ఈ సినిమా టైటిల్‌తో పాటు ‘ద ఫస్ట్ బ్రీజ్’ (The First Breeze) పేరుతో ఒక చిన్న గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటివరకు ‘హిట్’ సిరీస్, ‘సైంధవ్’ వంటి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్లతో మెప్పించిన శైలేష్ కొలను, ఈసారి పూర్తి భిన్నంగా రొమాంటిక్ కామెడీ జానర్‌ను ఎంచుకోవడం విశేషం. ఈ గ్లింప్స్‌లో హీరో రోషన్ (అభయ్) తన తల్లితో అమ్మాయిల గురించి, నేటి తరం రిలేషన్ షిప్స్ గురించి చేసే కామెడీ సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో రోషన్ సరసన ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్ (అపూర్వ పాత్రలో) కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఖుషి’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

