పాలకుర్తి, ఆగస్టు 21: శ్రావనమాసాన్ని పురస్కరించుకుని జంధాల(రాఖీ) పౌర్ణమి సందర్భంగా ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సామూహిక జంధ్యా ధారణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓంకారేశ్వరస్వామి ఆలయ సముదాయంలోని భక్త మార్కండేయస్వామి సన్నిధిలో పద్మశాలి కులస్తులు పట్టు వస్ర్తాలతో తరలి వచ్చారు. అర్చకుడు గంగు రాఘుశర్మ సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహికంగా జంధ్యాలను అలంకరించారు. రాఖీలతోపాటు నూలు నేసిన రోజుకు గుర్తుగా కొత్త జంధ్యాలను వేసుకున్నామని తెలిపారు. అనంతరం సోమనాథ ఆలయంలో శివుడికి వస్ర్తాలను సమర్పించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. తొలుత చిలకమరి ఉప్పలయ్య, పెనుగొండ రమేశ్, ఇంటి నుంచి పసుపు కుంకుమలతో ఓంకారేశ్వరస్వామి ఆలయానికి తరలి వచ్చారు. పూజల్లో పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిలకమారి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిదురాల మార్కండేయ్య, ఉపాధ్యక్షుడు చిదురాల ఎల్లయ్య, పెనుగొండ వెంకటేశ్వర్లు, కాటబత్తిని రమేశ్, మేడారపు సుధాకర్, చిలుకమారి సోమేశ్వర్, పెనుగొండ సోమశేఖర్, కూరపాటి ఉప్పలయ్య, గణేశ్, శ్రీకాంత్, చిలుకమారి శ్రీనివాస్, గూడెల్లి ఉపేందర్, సోమశేఖర్, చిలుకమారి సమ్మ య్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జంధ్యాలధారణ
కొడకండ్ల: మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో సర్పంచ్ పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో జంధ్యాధారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పద్మశాలి కులస్తులు సామూహికంగా జంధ్యా ధారణ చేశారు. పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు దోర్నాల ప్రభాకర్, పసునూరి నవీన్, మసురం వెంకటనారాయణ, మసురం రవీందర్, మసురం మోహన్, మసురం రమేశ్ పాల్గొన్నారు.