ములుగురూరల్/ మంగపేట/ గోవిందరావుపేట, ఆగస్టు 20: ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పుట్టిన రోజు సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ నాయకులు గట్టమ్మ దేవాలయం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. వేర్వేరు కార్యక్రమాల్లో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయరామ్నాయక్, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు మేర్గు సంతోష్‌యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకుడు పోలం శ్రావణ్ ఆధ్వర్యంలో గట్టమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు.
రక్తదాన శిబిరం ఏర్పాటు
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగపేట మండలం కమలాపురం జడ్పీ హైస్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంగపేటలో, కమలాపురం ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో కేక్‌లు కట్ చేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, సహకార సంఘం చైర్మన్ తోట రమేశ్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ మోహన్‌రెడ్డి, జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధరవర్మ, పప్పు వెంకట్‌రెడ్డి, తుమ్మ మల్లారెడ్డి, మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్ పాల్గొన్నారు.
చీరెలు పంపిణీ
గోవిందరావుపేటలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. రంగాపూర్‌లో స్పందన స్ఫూర్తి సొసైటీ అధ్యక్షుడు నెమలి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆదివాసీ వృద్ధ మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు దూడపాక రాజేందర్, శ్రీను, కార్యదర్శి శ్రీను, దళిత జనసేవ సమితి మండల అధ్యక్షుడు జన్ను సుధాకర్, రైతు బంధు సమితి చల్వాయి కోఆర్డినేటర్ బొల్లం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.