డోర్నకల్, ఆగస్టు 14: డోర్నకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా 2020-2021 సంవత్సరంలో కరోనా కష్టకాలంలో ఉత్తమ సేవలందించినందుకు, గార్లలో నూతన క్లబ్ ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్ విత్తనాల సుధాకర్‌కు లయన్స్ జిల్లా గవర్నర్ తమ్మెర లక్ష్మీనరసింహారావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, ముచ్చా రాజిరెడ్డి శుక్రవారం రాత్రి హన్మకొండలో నిర్వహించిన సకృతి నైట్ కార్యక్రమంలో మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. ఆ పదలో ఉన్నవారిని ఆదుకోవడం ఆత్మసంతృప్తి ఇస్తుందని, లయన్స్ క్లబ్ ద్వారా ఇలాంటి సేవ చేయడం అదృష్టం గా భావిస్తున్నట్లు తెలిపారు. డోర్నకల్ లయన్స్ క్లబ్ ప్రస్తుత అ ధ్యక్షుడు గోపాల్‌వర్మ, గార్ల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, కా ర్యదర్శి యశోధర్ జైన్, లయన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు వీ అప్పారావు, సభ్యులు నరేశ్, సత్యనారాయణరెడ్డి, రామకృష్ణ, ఉమేశ్, విజయ్ సుధాకర్‌ను అభినందించారు.
ఉత్తమ మహిళా అధ్యక్షురాలిగా..
తొర్రూరు: 2019-20 సంవత్సరానికి ఉత్తమ మహిళా అధ్యక్షురాలిగా సీడబ్ల్యూసీ జిల్లా చైర్ పర్సన్ డాక్టర్ ఎస్ నాగవాణి అవార్డు అందుకున్నారు. సేవా తరుణికి జిల్లా ఉత్తమ బ్యానర్ ప్రజెంటేషన్, ఉత్తమ విద్యా సేవల విభా గం, వజినపల్లి శైలజకు కమిటెడ్ ట్రెజరర్‌గా, ఎల్పీఐఎఫ్ డాక్టర్ వీ శారద జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు టీచర్స్ సభ్యులు ప్రత్యేక క్లబ్ స్థాపనకు అప్పటి అధ్యక్షుడు సూరం ఉపేందర్‌రెడ్డి, ఉత్తమ ట్రెజరర్‌గా చింతల సురేశ్, కొవిడ్ సేవా కార్యక్రమాల నిర్వహణతో పాటు పలు సేవలకు వార్డులు పొందారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా ప్రతినిధులు కన్నా పరశురాము లు, వెంకటేశ్వర్రావు, టీ వెంకట్‌రెడ్డి, తమ్మెర విశ్వేశ్వర్రావు, పీ కిరణ్‌కుమార్, టీచర్స్ క్లబ్ ప్రతినిధులు ఎం వాణి, రజిత, కే మాధవి, పీ శ్రీదేవి, కొండం నర్సింహారెడ్డి, ఏ సైదులు, ఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.