తొర్రూరు, ఆగస్టు 12: మండల కేంద్రంలోని దుబ్బతండాలో అత్యాధునిక సౌకర్యాలతో వైకుంఠధామం ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య తెలిపారు. రూ. కోటితో ఎకరం స్థలంలో నిర్మించనున్న వైకుంఠధామం పనులకు గురువారం కమిషనర్ గుండె బాబు, కౌన్సిలర్ ధరావత్ సునీతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో శ్మశానవాటిక నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో నాలుగు బర్నింగ్ బ్లాకులు, దహన సంస్కారాలకు వచ్చిన వారు వేచి ఉండేందుకు వీలుగా నాలుగు ప్రాంతాల్లో గద్దెలు నిర్మిస్తామన్నారు. పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలం కేటాయించామని, గ్యాస్ ఆధారిత దహనవాటికను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పొనుగోటి సోమేశ్వర్రావు, కౌన్సిలర్లు భూసాని రాము, గుగులోత్ శంకర్, ఎన్నమనేని శ్రీనివాస్‌రావు, నాయకులు జైసింగ్, దొంగరి శంకర్, దుబ్బతండా అభివృద్ధి కమిటీ సభ్యులు రాజేశ్‌నాయక్, ధరావత్ సోమన్న, భీమానాయక్, ధరావత్ బాలు, శంకర్, భూక్యా తారాసింగ్, శ్రీనివాస్, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.