నయీంనగర్, అక్టోబర్ 4: వ్యాక్సిన్‌తోనే రక్షణ అని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నా రు. ఆరోగ్య కేంద్రంలో సోమవారం వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సిన్ తో పాటు స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. 100 మంది విద్యార్థులు వ్యాక్సిన్ వేసుకున్నారని, మంగళవారం కుడా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వెంకట్రామరెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్‌లాల్, నరసింహారెడ్డి, హాస్టళ్ల డైరెక్టర్ ఇస్తారి, విజయ్‌కుమా ర్, శ్యామల, రేణుక, సరిత, పల్లవి, సలీం అహ్మద్ పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఎన్నిక
కాకతీయ విశ్వవిద్యాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఎన్నికైంది. నూతన అధ్యక్షుడిగా డాక్టర్ ఈసం నారాయణ, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పుల్లా శ్రీనివాస్ (ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కిరణ్, దయాకర్, జాయింట్ సెక్రటరీగా ప్రతాప్, కోశాధికారిగా మొగిలి, కార్యవర్గ సభ్యులుగా రవికుమార్, స్వీయ, ప్రకాశ్, రాజునాయక్, భాస్కర్, ఏమిలియ, అయిలయ్య ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రిన్సిపాల్ సురేశ్‌లాల్, సహాయ రిటర్నింగ్ ఆఫీసర్ పంజాల శ్రీధర్ తెలిపారు. అనంతరం కేయూ వీసీ తాటికొండ రమేశ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
బాధ్యతల స్వీకరణ
నయీంనగర్: కేయూ నూతన సమన్వయ అధికారిగా జంతుశాస్త్ర విభాగ సహా య ఆచార్యులు డాక్టర్ ఈసం నారాయణ సోమవారం డాక్టర్ ఎస్ జ్యోతి నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలువురు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు.
బయోటెక్నాలజీని పరిశీలించిన వీసీ
విశ్వవిద్యాలయంలోని బయోటెక్నాలజీ విభాగం, తరగతి గదులు, ప్రయోగశాలలను కేయూ వీసీ తాటికొండ రమేశ్ పరిశీలించారు. అనంతరం తరగతుల పురోగతిని విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ వెంకట్రామరెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్‌లాల్, శాస్త్రి, పుల్లా శ్రీనివాస్ ఉన్నారు.
జగన్మోహన్కు డాక్టరేట్
కాకతీయ విశ్వవిద్యాలయ ప్రభుత్వపాలనా శాస్త్ర పరిశోధకు డు కొంగర జగన్మోహన్కు పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి డాక్టరేట్ ప్రకటించారు. ఆయన ’ట్రైబల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్‌ది ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్-ఏ స్టడీ’ అంశంపై విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ సుజాతాకుమారి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.