పూలను పూజించే పండుగ బతుకమ్మ
ఆడబిడ్డల సంతోషం కోసమే చీరెల పంపిణీ
ఎమ్మెల్యే హరిప్రియానాయక్
గార్ల/ బయ్యారం, అక్టోబర్ 3 : సంస్కృతీ సంప్రదాయాలకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఆదివారం ఆమె జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందుతో కలిసి గార్ల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో, బయ్యారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూలను పూజించే పండుగ బతుకమ్మ అని, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని తన కుటుంబంగా భావించి, ఆడబిడ్డలకు పెద్దన్నగా బతుకమ్మ చీరెలను అందిస్తున్నారన్నారు. గత పాలకులు బతుకమ్మ పండుగకు సరైన గుర్తింపునివ్వలేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ బతుకమ్మను తగిన గుర్తింపునిచ్చి ఘనంగా జరుపుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గార్లలో ఎంపీపీ మూడు శివాజీ చౌహాన్, పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, ఎంపీటీసీ శీలంశెట్టి రమేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్, తహసీల్దార్ స్వాతి బిందు, ఎంపీడీవో రవీందర్ రావు, సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్, కో ఆప్షన్ సభ్యుడు ఖాధర్బాబు, టీఆర్ఎస్ మండల సంయుక్త కార్యదర్శి గుండా వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పానుగంటి రాధాకృష్ణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బయ్యారంలో మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ తాత గణేశ్, సొసైటీ చెర్మన్ మూల మధుకర్‌రెడ్డి, ఎంపీడీవో చలపతిరావు, ఎంపీటీసీ శైలజారెడ్డి, కుమారి, సర్పంచ్ కోటమ్మ, ఉపసర్పంచ్ కవిత, నాయకులు సోమిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, భాషా, తహసీల్దార్ నాగభవాని పాల్గొన్నారు.